మెడలో మంగళసూత్రంతో క్యాట్ క్యూట్ సెల్ఫీ..

బాలీవుడ్ అడోరబుల్ కపుల్ విక్కీ కుషాల్- కత్రినా కైఫ్ తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. గతేడాది పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంట సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తున్నారు. పెళ్ళైన కొత్త కోడలు అత్తారింట్లో అడుగుపెట్టాక స్వీట్ చేయడం ఆనవాయితీ అని తెలిసి కత్రినా అత్తవారింట్లో స్వీట్ చేసి భర్తకు తినిపించిన సంగతి తెలిసిందే. ఇంత పెద్ద స్టార్ అయ్యి ఉండి కూడా అత్తవారింట్లో ఒదిగి ఉండడంతో క్యాట్ తన వివాహ బంధానికి ఎంత వాల్యూ ఇస్తుందో అని అర్ధం చేసుకోవచ్చు.

ఇక తాజాగా క్యాట్ ఒక క్యూట్ సెల్ఫీని అభిమానులతో పంచుకోంది. వింటర్ స్వేట్ షర్ట్ వేసుకొని సోఫాలో తిరిగా కూర్చొని నవ్వులు చిందిస్తుంది. అయితే ఈ ఫొటోలో మల్లీశ్వరి నవ్వులతో పాటు అమ్మడి మంగళ సూత్రం కూడా హైలైట్ గా నిలిచింది. ఈ కాలంలో కొద్దిగా ఫేమ్ ఉన్న స్టార్లే తమ మేడలో మంగళ సూత్రం కనిపించకుండా లోపలికి తోసేయడమో, లేక దాన్ని కవర్ చేస్తూ పైన నగలు అలకరించడమో చేస్తూ ఉంటారు. కానీ, క్యాట్ మాత్రం హుందాగా పెళ్లి అయిన యువతిగా మంగళ సూత్రంతో కనిపించి అభిమానుల మనసు దోచుకొంది. ప్రస్తుతం క్యాట్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related Articles

Latest Articles