పిచ్చెక్కించిన మాజీ సూపర్ మోడల్… పచ్చబోట్లు పొడుస్తోంది!

కేట్ మోస్ టాటూ పాఠాలు నేర్చుకుంటోంది. 1990లలో ఈ సూపర్ మోడల్ ఫ్యాషన్ కి మారుపేరుగా ఉండేది. ఆమె పేరు మీద జరిగే ఫ్యాషన్ షోస్ అదిరిపోయేవి. ఆమె పేరున చెలామణి అయ్యే క్లోతింగ్ రేంజ్ భారీ రేటుకు అమ్ముడుపోయేది. ఫోర్బ్స్ లిస్టులో కూడా కేట్ మోస్ అత్యధిక ఆదాయం గల రెండవ వ్యక్తిగా స్తతా చాటింది!
2005 తరువాత నుంచీ డ్రగ్స్ సంబంధమైన ఆరోపణలు ఎదుర్కొని 2012లో ఎట్టకేలకు అన్ని కేసుల్లోంచి బయటపడ్డ కేట్ మోస్ ప్రస్తుతం సీనియర్ సూపర్ మోడల్ గా కొనసాగుతోంది. గతంలో మాదిరిగా కేట్ కు ఇప్పుడు క్రేజ్ లేకున్నా ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఆమె ఓ లెజెండ్. ఆమె ప్రస్తుతం తన ఫ్రెండ్ డేనియల్ కసోనే వద్ద టాటూ పాఠాలు నేర్చుకుంటోందట! అంతే కాదు, బ్రిటన్ లోని ‘గ్లాస్టన్ బరీ’ ప్రాంతంలో జరిగే ‘ఫెస్టివల్ ఆఫ్ పర్ఫామింగ్ ఆర్ట్స్’కి వెళదామని అంటోందట. అక్కడ తన ప్రతిభ చూపుతానని కేట్ మోస్ ఉత్సాహపడుతోందంటూ డేనియల్ చెప్పాడు. ఇప్పటికే అతని వద్ద టాటూ ఎలా వేయాలో నేర్చుకున్న మోస్ ‘కేట్’ అనే పదం డేనియల్ ఒంటి మీద టాటూగా వేసిందట. ‘లవ్ హార్ట్’ బొమ్మ కూడా ఆయన చేతి మీద టాటూగా ముద్ర వేసిందట!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-