లోకేష్ ఒక జోకర్.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఆయన కథ చూస్తాం !

టిడిపి నేత నారా లోకేష్ పై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే లోకేష్ కథ చూస్తామని హెచ్చరించారు. చేరుకులపాడు నారాయణరెడ్డి హత్య తరువాత వచ్చిన జగన్ ప్రజలను శాంతంగా వుండాలని చెప్పారని….లోకేశ్ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు వయసు అయిపోతుంది…ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని..తిట్టాలనుకుంటే మేము తిట్టగలం…మాకు ఆ సంస్కృతి లేదన్నారు. మంచి సంస్కారంతో జగన్ ను.. రాజశేఖర్ రెడ్డి పెంచాడన్నారు. లోకేష్ ఎంత సేపు ట్విట్టర్ లో మాట్లాడాల్సిందే… ప్రజల ముందుకు వచ్చి మాట్లాడలేడని ఎద్దేవా చేశారు. పెసరవాయి హత్యలో పోలీస్ దర్యాప్తుపై నమ్మకం ఉందన్నారు.

read more : పార్ల‌మెంట్ స్టాండింగ్ క‌మిటీ ముందుకు ట్విట్ట‌ర్ ప్ర‌తినిధులు…

లోకేష్ ఒక జోకర్.. వార్డు మెంబర్ గా కూడా గెలవలేదని చురకలు అంటించారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేయకుండా నిలవడం ఎవరితరం కాదని.. టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఏమి చేశారో గుర్తు చేసుకోవాలని మండిపడ్డారు.. హత్య రాజకీయలను ప్రోత్సహించాల్సిన అవసరం తమకు లేదని.. నారా లోకేష్ కు సంస్కారంగా మాట్లాడడం కూడా తెలీదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ను చూసి లోకేష్ నేర్చుకోవాలని.. మాజీ సీఎం వైఎస్సార్ కొడుకుగా జగన్ ఎలా మాట్లాడుతున్నారో లోకేష్ నేర్చుకోవాలని చురకలు అంటించారు. పులికి పులిబిడ్డ పుట్టింది…నక్కకు నక్క బిడ్డ పుట్టిందని.. లోకేష్ బఫున్ కి ఎక్కువ ..జోకర్ కి తక్కువ అని సెటైర్లు వేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-