ఇంట్రెస్టింగ్ గా కార్తికేయ ‘రాజావిక్రమార్క’ టీజర్

‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ భిన్నమైన సినిమాలను చేస్తూ ముందు వెళ్తారు. ‘గుణ 369, 90ML, చావు కబురు చల్లగా’ లాంటి సినిమాలతో అలరించిన ఈ హీరో ప్రస్తుతం ‘రాజావిక్రమార్క’ సినిమా చేస్తున్నారు. శ్రీసరిపల్లి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కాబోతున్నాడు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా తాజాగా టీజర్ విడుదల చేశారు. చాలా డిఫరెంట్ గా సాగిన ఈ టీజర్ లో కార్తికేయ ఎక్కువగా గన్స్ తో కనిపించగా.. ఆపై కాస్త కామెడీని జోడించారు. కార్తికేయ రహస్య ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు సమాచారం. సాయి కుమార్, తనికెళ్ళ భరణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్య రవిచంద్రన్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. రామారెడ్డి నిర్మిస్తున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-