ఆర్యన్ కార్తీక్ ‘థమాకా’ ఎప్పుడంటే…

బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న టెర్రర్ మీడియా థ్రిల్లర్ ‘థమాకా’ మూవీపై అతని అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ మధ్వానీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాకు బేస్ 2013లో వచ్చిన కొరియన్ మూవీ ‘ది టెర్రర్ లైవ్’. ఓ బ్రిడ్జ్ ను బ్లాస్ట్ చేసిన టెర్రరిస్టుని యంగ్ జర్నలిస్ట్ ఒకరు ఇంటర్వ్యూ చేస్తారు. దాంతో అతనికి బెదిరింపులు రావడం మొదలవుతుంది. ఊహించని ఈ ఉపద్రవం నుండి ఆ జర్నలిస్ట్ ఎలా బయటపడ్డాడు అన్నదే చిత్రకథ. హిందీలో ‘థమాకా’ పేరుతో రీమేక్ అయిన ఈ మూవీలో జర్నలిస్ట్ గా కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నాడు. మృణాల్ ఠాకూర్, అమృత సుభాష్‌, వికాస్ కుమార్, విశ్వజీత్ ప్రధాన్ మిగిలిన ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాను తొలుత ధియేటర్లలోనే విడుదల చేయాలని అనుకున్నా, కరోనా సెకండ్ వేవ్ తర్వాత దర్శక నిర్మాత రామ్ మధ్వానీ మనసు మార్చుకుని నెట్ ఫ్లిక్స్ వైపు మొగ్గు చూపాడు. దాంతో ఈ మోస్ట్ అవేటింగ్ మూవీని ఆ సంస్థ నవంబర్ లో స్ట్రీమింగ్ చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఉద్దేశ్య పూర్వకంగా స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించకుండా, హోల్డ్ లో పెట్టారు కానీ దీపావళి కానుకగా నవంబర్ 3 లేదా 4వ తేదీలో నెట్ ఫ్లిక్స్ ‘ధమాకా’ ను స్ట్రీమింగ్ చేస్తుందని అంటున్నారు.

-Advertisement-ఆర్యన్ కార్తీక్ 'థమాకా' ఎప్పుడంటే...

Related Articles

Latest Articles