బన్సాలీ భారీ ఆఫర్ ని లైట్ తీసుకున్న రణబీర్…

బాలీవుడ్ లో ఎంతటి క్రేజీ ఆఫర్లు, ఎలాంటి పెద్ద దర్శకుల నుంచీ వచ్చినా… ఒక్క స్టార్ హీరో మాత్రం రిజెక్ట్ చేసేస్తుంటాడు! అతనే… రణబీర్ కపూర్! ఆయన జోయా అఖ్తర్ మూడు సార్లు మూవీస్ ఆఫర్ చేస్తే నిర్ధాక్షిణ్యంగా తిరస్కరించాడు. ‘జిందగీ నా మిలేగీ దుబారా, దిల్ దఢక్ నే దో, గల్లీ బాయ్’ చిత్రాలు మొదట రణబీర్ వద్దకే తీసుకెళ్లింది జోయా! కానీ, ఎందుకో ఏమో వద్దనేశాడు ఆర్కే. ఇక ఇప్పుడు, నన్ అదర్ ద్యాన్, బాలీవుడ్ షో మ్యాన్ సంజయ్ లీలా బన్సాలీకి కూడా ఆయన నో చెప్పాడట…

‘రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్, గంగూభాయ్’ … ఇలా వరుసగా క్రేజీ చిత్రాలు చేస్తోన్న టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి. ఆయనతో వర్క్ చేయాలని రణవీర్, దీపికా లాంటి స్టార్స్ మొదలు అందరూ తహతహలాడుతుంటారు. ఇక మామూలు నటీనటుల సంగతి చెప్పేదేముంది? కానీ, రణబీర్ మాత్రం బన్సాలీ స్వయంగా వచ్చి సినిమా ఆఫర్ చేస్తే వద్దంటున్నాడట! అలనాటి ఆణిముత్యమైన ‘బైజు బావ్రా’ సినిమాను సంజయ్ రీమేక్ చేద్దామనుకున్నాడు. అందులో రణబీర్ తో పాటూ ఆలియా, దీపికా, అజయ్ దేవగణ్ కూడా నటిస్తారని ప్రచారం జరిగింది. ఈ సంవత్సరం ప్రారంభంలో కూడా రణబీర్ తన తొలి దర్శకుడితో మళ్లీ సినిమా చేయబోతున్నాడనే బాలీవుడ్ లో చెప్పుకున్నారు. కానీ, లెటెస్ట్ గా ‘కపూర్ లాడ్లా’ మనసు మారిందట…

రణబీర్ తొలి చిత్రం ‘సావరియా’ సంజయ్ లీలా బన్సాలీనే డైరెక్ట్ చేశాడు. కానీ, ఆయనతో ఎందుకోగానీ ఆర్కేకి స్నేహం కుదరలేదు. అందుకే, ఇన్నేళ్లలో మళ్లీ ఎప్పుడూ వారిద్దరు సినిమా చేయలేదు. ప్రస్తుతం రణబీర్ ‘బైజు బావ్రా’ రీమేక్ కి కూడా సారీ చెప్పటంతో ఇక వీరిద్దరి కాంబినేషన్ దాదాపు అసాధ్యమే అంటున్నారు. చూడాలి మరి, బయట ప్రచారం జరుగుతున్నట్టుగా రణబీర్ స్థానంలోకి కార్తీక్ ఆర్యన్ వస్తాడేమో! లేదా చివరి నిమిషంలో ‘బ్రహ్మాస్త్ర’ స్టార్ బన్సాలీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడేమో…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-