బాలీవుడ్ యంగ్ హీరోతో… కార్తీక్ ఆర్యన్ బ్రోమాన్స్!

కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ‘భుల్ భులయ్యా 2’తో పాటూ మరికొన్ని చిత్రాలు ఆయన పూర్తి చేయాల్సి ఉంది. అయితే, కెమెరా ముందు ఎంత బిజిగా ఉన్నా కాస్త ఫ్రీ టైం చేసుకుని తన బెస్ట్ ఫ్రెండ్ ని కలిశాడు బాలీవుడ్ యంగ్ హీరో…

కార్తీక్ ఆర్యన్, సన్నీ సింగ్ ఇద్దరూ కలసి ‘ప్యార్ కా పంచ్ నామా 2, ‘సోనూ కే టిటూ కీ స్వీటీ’ సినిమాలు చేశారు. ఇద్దరి కెరీర్స్ దాదాపుగా ఒకేసారి మొదలయ్యాయి. కార్తీక్ బిజీ హీరోగా మారిపోగా సన్నీ సింగ్ కూడా కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ప్రభాస్, కృతీ సనన్ స్టారర్ ‘ఆదిపురుష్’లో లక్ష్మణుడిగా కనిపించబోయేది సన్నీ సింగే!

కార్తీక్, సన్నీ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ కాస్త వీలు చేసుకుని అలా కార్ లో షికారు చేసి వచ్చారు. ఆ ఫోటోని సన్నీ సింగ్ సొషల్ మీడియాలో షేర్ చేయగా కార్తీక్ ఆర్యన్ కూడా నెటిజన్స్ తో పంచుకున్నాడు. ‘సోనూ కా టీటూ’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. బాలీవుడ్ లో హీరో, హీరోయిన్స్ మధ్య రొమాన్స్ సహజమే! అయితే, కొందరు హీరోల మధ్య బ్రోమాన్స్ కూడా అప్పుడప్పుడూ జనాల దృష్టిని ఆకర్షిస్తుంటుంది. కార్తీక్, సన్నీ సింగ్ బ్రోమాన్స్ కూడా అలాంటిదే! వీరిద్దరి కాంబినేషన్ లో ‘ప్యార్ కా పంచ్ నామా’, ‘సోనూ కే టిటూ కీ స్వీటీ’ చిత్రాల సీక్వెల్స్ కోసం యంగ్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు…

బాలీవుడ్ యంగ్ హీరోతో… కార్తీక్ ఆర్యన్ బ్రోమాన్స్!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-