కార్తీక్ ఆర్యన్ కాంట్రవర్సీలో… కత్రీనా కోణం!

గత కొన్ని రోజులుగా బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ రకరకాల రాంగ్ రీజన్స్ తో న్యూస్ లో ఉంటున్నాడు. మొదట ‘ధర్మా ప్రొడక్షన్స్’ ‘దోస్తానా 2’ నుంచీ ఆయన్ని తీసేశారని వార్తలొచ్చాయి. అయితే, కరణ్ జోహర్ సారథ్యంలో నిర్మాణ సంస్థ అధికారికంగానే ‘క్రియేటివ్ డిఫరెన్సెస్’ అంటూ ప్రకటన విడుదల చేసింది. కార్తీక్ ఆర్యన్ చేతి నుంచీ ‘దోస్తానా 2’ జారిపోయిన కొద్ది రోజులకే షారుఖ్ ఖాన్ బ్యానర్ ‘రెడ్ చిల్లీస్’ కూడా ఈ యంగ్ హీరోని దూరం పెట్టిందని దుమారం రేగింది. అయితే, ‘ఫ్రెడ్డీ’ అనే టైటిల్ తో తెరకెక్కాల్సిన ఈ సినిమా పై రకరకాల గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.

కరణ్ జోహర్ తో కార్తీక్ ఆర్యన్ కు చెడటంతోనే కింగ్ ఖాన్ కూడా సినిమాలోంచి అతడ్ని తొలగించాడని కొందరు వాదిస్తున్నారు. సుశాంత్ రాజ్ పుత్ లాగే వారసత్వం లేకుండా బీ-టౌన్ లోకి వచ్చిన కార్తీక్ ని కూడా… ముంబై మాఫియా టార్గెట్ చేస్తోందని అనే వారు కూడా లేకపోలేదు. అందులో వాస్తవం ఎంత ఉన్నా ఇప్పుడు మరో పుకారు షికారు చేస్తోంది. రెడ్ చిల్లీస్ సంస్థ కార్తీక్ తో రూపొందించాలని అనుకున్న సినిమాలో కత్రీనా హీరోయిన్. కానీ, ఆమెతో నటించేందుకు యంగ్ హీరో ససేమీరా అన్నాడట. అందుకే, అతడ్ని పక్కన పెట్టారని లెటెస్ట్ టాక్! అయితే, ఇది కూడా నిజం కాదని కొందరు ఖండిస్తున్నారు.

కార్తీక్ ఆర్యన్, కత్రీనా జంటగా అజయ్ బాల్ దర్శకత్వంలో ‘ఫ్రెడ్డీ’ తెరకెక్కాల్సింది. కానీ, షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ బ్యానర్ బ్యాంక్ రోల్ చేస్తోన్న ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ విషయంలో సమస్యలు ఎదుర్కొంటోంది. దర్శకుడ్ని స్క్రిప్ట్ మార్చమని నిర్మాణ సంస్థ అడుగుతోందట. అందుకు ఆయన ఒప్పుకోకపోవటంతో ‘ఫ్రెడ్డీ’ మూవీ డిలే అవుతోంది. అసలు ఇంత వరకూ ఎవ్వర్నీ అఫీషియల్ గా సైన్ చేయించలేదట. అంతలోనే కార్తీక్ గురించి, కత్రీనా గురించి పుకార్లు రావటంతో పెద్ద రచ్చగా మారిపోయింది.

కార్తీక్ ఆర్యన్ విషయంలోనే మరో గాసిప్ కూడా గందరగోళం సృష్టిస్తోంది. అతడ్ని ఆనంద్ ఎల్ రాయ్ సినిమా నుంచీ కూడా తీసేశారని ముంబై టాక్. ఇది అవాస్తవమని డైరెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశాడు. కార్తీక్ ఆర్యన్ తో ఆనంద్ ఎల్ రాయ్ ప్లాన్ చేసిన సినిమా ఇంకా ఫైనలైజ్ కాలేదనీ, హీరోతో ఓన్లీ ఒక మీటింగ్ మాత్రమే జరిగిందని దాని సారాంశం! మొత్తానికి తెర వెనుక ఏం జరుగుతుందో కానీ… కార్తీక్ ఆర్యన్ దుమారం బాలీవుడ్ లో రోజురోజుకు పెద్దదవుతోంది. దీనిపై యంగ్ హీరో ఇంకా ఏమీ మాట్లాడకపోవటమే… అసలు ట్విస్ట్!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-