రెండు విభిన్నమైన గెటప్పులో ‘సర్దార్’.. ఫోటోలు వైరల్

కోలీవుడ్ లో విభిన్నమైన కథలను ఎంచుకోవాలన్నా.. కొత్త కొత్త ప్రయోగాలు చేయాలన్నా హీరో కార్తీ ముందుంటాడు. ఇప్పటివరకు కార్తీ చేసిన సినిమాలన్నీ విభిన్నమైన కథలే అనడంలో అతిశయోక్తి లేదు. ఇక కార్తీకి తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు ఎప్పటికప్పుడు తెలుగులోనూ డబ్ అవుతుంటాయి. ఇక ప్రస్తుతం కార్తీ ‘సర్దార్’, ‘విరుమన్’ చిత్రాలతో పాటు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఇకపోతే పాత్ర కోసం ప్రాణం పెట్టె కార్తీ.. సర్దార్ సినిమాకోసం రెండు విభిన్నమైన గెటప్పులో కనిపించనున్నాడట.

చక్ర` ఫేమ్ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తీ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. ఇక ఈ గెటప్ తో పాటు ఒక వృద్ధులం గెటప్ లో కూడా కార్తీ మెరవనున్నాడు. కార్తి టూ డైమెన్షన్స్ వున్న పాత్రల్లో ఉన్న ఫోటోలు నెట్టింటో వైరల్ గా మారాయి. యంగ్ లుక్ లో ఉన్న కార్తీ కొద్దిగా ఒళ్ళు చేసి కనించగా.. ఓల్డ్ లుక్ కోసం కార్తీ చాలా కష్టపడినట్లు కనిపిస్తోంది. తెల్ల జుట్టు.. బక్క పలచని శరీరంతో అదరగొట్టేశాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో కార్తీ సరసన రాశి ఖన్నా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ సిమ్రాన్, బాలీవుడ్ నటుడు చుంకీ పాండే విలన్ గా కనిపించనున్నారు. త్వరలోనే విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమాతో కార్తీ మరోసారి హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.

Related Articles

Latest Articles