కార్తికేయ సరసన ‘చి.ల.సౌ.’ భామ!

యంగ్ హీరో కార్తికేయ ‘రాజా విక్రమార్క’తో పాటు మరో రెండు, మూడు తెలుగు సినిమాలు చేస్తున్నాడు. అందులో చాలా వరకూ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నాయి. అయితే విశేషం ఏమంటే… అజిత్ హీరోగా బోనీ కపూర్ నిర్మిస్తున్న తమిళ చిత్రం ‘వాలిమై’లో కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే… తాజాగా యూవీ క్రియేషన్స్ సంస్థ సైతం కార్తికేయతో ఓ సినిమాను ప్లాన్ చేసింది. అందులో ‘చి.ల.సౌ.’ ఫేమ్ రుహానీ శర్మను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. తెలుగులో ‘హిట్’తో పాటు ‘డర్టీ హరి’లోనూ నటించిన రుహానీ శర్మ మరో చక్కని విజయం కోసం ఎదురుచూస్తోంది.

Read Also : స్టార్ హీరోయిన్ సినిమాతో అల్లు అర్హున్ కూతురు ఎంట్రీ ?

అవసరాల శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ‘నూటొక్క జిల్లాల అందగాడు’లోనూ రుహానీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక పేరు నిర్ణయించని కార్తీకేయ తాజా చిత్రాన్ని ప్రశాంత్ అనే కొత్త కుర్రాడు డైరెక్ట్ చేయబోతున్నాడట. ఇటీవలే యూవీ క్రియేషన్స్ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ లోనూ సినిమాలు నిర్మిస్తోంది. అందులో మొదటి సినిమాగా ‘ఏక్ మినీ కథ’ వచ్చింది. మరి ఇప్పుడీ కార్తికేయ మూవీని నిర్మాతలు ప్రమోద్, వంశీ ఏ బ్యానర్ లో తీస్తారో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-