రేపే “ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్” ట్రైలర్

ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’. విద్యా సాగర్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ను ‘బాషా’ దర్శకుడు సురేష్ కృష్ణ నిర్మించారు. నందిని రాయ్ కీలకపాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ జూన్ నుండి ఆహాలో ప్రసారం అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ చర్చనీయాంశము అయ్యింది. తాజాగా ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ చేతుల మీదుగా శనివారం ఉదయం 10 గంటలకు ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ తోనే బజ్ క్రియేట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ తో మరెంత హాట్ టాపిక్ అవుతుందో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-