‘నా పేరు శివ 2’ గా కార్తీ హిట్ సినిమా ..

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో ఒకటి నా పేరు శివ. తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాకు సుసీంద్రన్ దర్శకత్వం వహించాడు. ఇక 2010లో రిలీజైన ఈ లవ్ అండ్ యాక్షన్ ఫిల్మ్ కు సీక్వెల్ గా మరో కార్తీ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. పా. రంజిత్ దర్శకత్వంలో కార్తి – క్యాథరీన్ థెరిసా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ”మద్రాస్”. ఈ సినిమా తమిళ్ లో ఘనవిజయం సాధించింది.

ఇక ఈ చిత్రాన్ని తెలుగులో నా పేరు శివ 2 గా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని స్టూడియో గ్రీన్ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జనవరి 13 న ఈ సినిమా థియేటర్లో విడుదల కానున్నట్లు తెలిపారు. నా పేరు శివ తరహాలోనే మద్రాస్ కూడా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ కావడంతో తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మేకర్స్ తెలుపుతున్నారు. మరి ఈ సినిమా కార్తీకి ఎలాంటి విజయం తీసుకొస్తుందో చూడాలి.

Related Articles

Latest Articles