కరోనా పోరులో నేను సైతం అంటున్న కార్తి…!

కరోనాను పారద్రోలే ప్రయత్నంలో సెలెబ్రిటీలంతా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ను వేయించుకుంటున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో కార్తీ కోవిడ్ -19 వ్యాక్సిన్‌లో మొదటి మోతాదును తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పిక్ పోస్ట్ చేశారు కార్తీ. ఈ పిక్ లో కార్తీ హెయిర్ స్టైల్ డిఫరెంట్ గా ఉండడం మనం చూడవచ్చు. ఇక కరోనా పోరులో భాగంగా కార్తీ తన అన్న, తండ్రితో కలిసి తమిళనాడు ప్రభుత్వానికి కోటి రూపాయల విరాళాన్ని అందించారు. అంతేకాకుండా కరోనా కారణంగా ఉద్యోగాలు పోగొట్టుకున్న దాదాపు 400 మంది అభిమానుల ఖాతాలకు కార్తీ, సూర్య రూ.5000 ఇచ్చారు. కాగా ఇప్పటికే కీర్తి సురేష్, ఐశ్వర్య రాజేష్, మాళవిక మోహనన్, ప్రగ్యా జైస్వాల్, అశోక్ సెల్వన్ వంటి ప్రముఖులు కోవిడ్ -19 వ్యాక్సిన్ మొదటి మోతాదును తీసుకున్నారు. కార్తీ సినిమాల విషయానికొస్తే… పిఎస్ మిత్రాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సర్దార్”లో నటిస్తున్నాడు సూర్య. ఇందులో రాశి ఖన్నా, రాజిషా విజయన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇంకా మణిరత్నం ప్రతిష్టాత్మక చిత్రం “పొన్నియిన్ సెల్వన్”లో కూడా కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇందులో విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూలిపాల, శరత్‌కుమార్ పలువురు ప్రముఖ పాత్రల్లో నటించారు. ఈ భారీ బడ్జెట్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-