లోన్ అప్లికేష‌న్‌ను రిజక్ట్ చేశార‌ని… బ్యాంకునే త‌ల‌గ‌బెట్టాడు…

క‌ర్ణాట‌కకు చెంద‌ని ఓ వ్య‌క్తి త‌న‌కు డ‌బ్బు అవ‌స‌రం కావ‌డంతో బ్యాంకునుంచి తీసుకోవాల‌ని అనుకున్నాడు.  లోన్ కోసం బ్యాంకుకు అప్లికేష‌న్ పెట్టుకున్నాడు.  అయితే, బ్యాంకు అధికారులు అత‌ని డాక్యుమెంట్స్‌ను ప‌రిశీలించిన త‌రువాత లోన్ అప్లికేష‌న్‌ను రిజ‌క్ట్ చేశారు.  దీంతో ఆగ్ర‌హించిన ఆ వ్య‌క్తి  బ్యాంకుకు నిప్పంటించాడు. బ్యాంకులు మంట‌లు అంటుకోవ‌డంతో వెంట‌నే స్పందించిన అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు.  ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన వ్య‌క్తిపై పోలీసులు సెక్ష‌న్ 246,477,435 ఐపీసీ కింద కేసులు న‌మోదు చేశారు.  ఈ సంఘ‌ట‌న హ‌వేరీలోని క‌గినెల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది.  లోన్ అప్లికేష‌న్‌ను రిజ‌క్ట్ చేస్తే బ్యాంకును త‌గ‌ల‌బెట్ట‌డం ఏంట‌ని స్థానికులు ప్ర‌శ్నిస్తున్నారు.  ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.  క‌రోనా కాలంలో ల‌క్ష‌లాది మంది ఉపాధి అవ‌కాశాలు కోల్పోయారు.  బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని ఇత‌ర అవ‌స‌రాల‌కు వినియోగించుకుంటున్నారు. 

Read: భార‌త్‌లో స్వ‌ల్పంగా త‌గ్గిన క‌రోనా కేసులు…

Related Articles

Latest Articles