17 ఏళ్లుగా అడవిలో ఒంట‌రిగా… ఇదే కార‌ణం…

మాములుగా ఇంట్లో ఒంట‌రిగా ఉండాలంటేనే వామ్మో అనేస్తాం.  అలాంటిది అడ‌విలో ఒంట‌రిగా ఉండాలంటే ఇంకేమైనా ఉన్న‌దా చెప్పండి.   ఒక‌రోజో రెండు రోజులో అనుకుంటే స‌రేలే అనుకోవ‌చ్చు.  17 ఏళ్లు ఒంట‌రిగా అడ‌విలో ఉండ‌టం అంటే మాములు విష‌యం కాదు. 56 చంద్ర‌శేఖ‌ర్ అనే వ్య‌క్తి క‌ర్ణాట‌క‌లోని మంగ‌ళూరు అడ‌వుల్లో గ‌త 17 ఏళ్లుగా ఒంట‌రిగా నివాసం ఉంటున్నాడు.  ఒంట‌రిగా సుల్యాకు 15 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న అరంతోడ్ గ్రామం నుంచి అద్దేల్ నెక్కారే అడ‌వుల్లో ప్ర‌యాణం చేస్తుంటే ఆ అడ‌విలో  చిన్న మార్గం ప‌క్క‌న ప్లాస్టిక్ క‌వ‌ర్ క‌ప్పిన గుడిసే క‌నిపిస్తుంది.  అందులో ఒక‌ప్ప‌టి ప్రీమియం ప‌ద్మినీ కారు ఉంటుంది.  అ గుడిసెలో కారులో చంద్ర‌శేఖ‌ర్ నివ‌శిస్తున్నాడు.   17 ఏళ్ల క్రితం ఆయ‌న‌కు నెక్ర‌ల్ కెమ్రాజీ అనే గ్రామంలో 1.5 ఎక‌రాల భూమి ఉన్నది.  సాగు నిమిత్తం ఆయ‌న స్థానిక స‌హ‌కార బ్యాంకు నుంచి రూ.40 వేలు రుణం తీసుకున్నాడు.  అయితే, కొన్ని కార‌ణాల వ‌ల‌న ఆయ‌న త‌న బాకీ తీర్చ‌లేక‌పోయాడు.  దీంతో అధికారులు ఆయ‌న పొలాన్ని వేలం వేశారు.  మ‌న‌స్థాపం చెందిన చంద్ర‌శేఖ‌ర్ వెంట‌నే త‌న కారును, సైకిల్‌ను తీసుకొని అడ‌విలోకి వ‌చ్చేశారు.  అడ‌విలోనే నివ‌శిస్తున్నాడు.  అడ‌విలో దొరికే కాయ‌లు తింటూ, జ‌ల‌పాతాల వ‌ద్ధ స్నానం చేస్తూ జీవిస్తున్నాడు. ఆహారం కోసం బుట్ట‌లు చేసి వాటిని స‌మీపంలోని గ్రామాల్లో అమ్మి వ‌చ్చి డ‌బ్బుతో కావాల్సిన నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేసుకునేవాడు. విష‌యం తెలుసుకున్న క‌లెక్ట‌ర్ ఆయ‌న్ను క‌లిసి ఇల్లు క‌ట్టిస్తాన‌ని చెప్పినా దానికి చంద్ర‌శేఖ‌ర్ ఒప్పుకోలేద‌ట‌.  త‌న‌కు అడ‌వి చాల‌ని, అక్క‌డున్న జంతువులు త‌న‌ను ఏమీ చేయ‌వ‌ని అన్నారు.  అట‌వీశాఖ అధికారులు కూడా చంద్ర‌శేఖ‌ర్ వ‌ల‌న అడ‌వికి ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని చెప్పారు.  

Read: ల‌ఖింపూర్ ఖేరీ ఘ‌ట‌న‌: క్రైమ్ బ్రాంచ్ ముందుకు కేంద్ర‌మంత్రి కుమారుడు

-Advertisement-17 ఏళ్లుగా అడవిలో ఒంట‌రిగా... ఇదే కార‌ణం...

Related Articles

Latest Articles