ఆ పని చేశాడని నడిరోడ్డుపై నగ్నంగా తిప్పించి..

సమాజంలో జరిగే తప్పులను సరిదిద్దడానికే పోలీసులు ఉన్నారు. చట్టాన్ని ఎవరు పడితే వాళ్ళు తమ చేతుల్లోకి తీసుకోకూడదు. తాజాగా కర్ణాటకలో పలువురు గ్రామస్థులు దారుణానికి ఒడిగట్టారు. ఒక ఆకతాయి కుర్రాడు చేసిన అల్లరి పనికి కఠిన శిక్ష విధించారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని హసన్ జిల్లాలో మేఘరాజ్ అనే యువకుడు నివసిస్తున్నాడు. నిత్యం అతడు సాయంత్రం అవ్వగానే  మహారాజా పార్క్‌కు వెళ్తూ ఉంటాడు. ఇటీవల కూడా పార్క్ కి వెళ్లిన అతనికి అక్కడ ఒక బాలిక కనిపించడంతో ఆమె దగ్గరకు వెళ్లి అనుచితంగా ప్రవర్తించాడు.

ఇక ఇది చూసిన గ్రామ పెద్దలు మేఘరాజ్ పై విరుచుకుపడ్డారు. అతనిని చితకబాదారు. అమ్మాయిలను ఏడిపిస్తున్నావా అంటూ బట్టలు విప్పి, నగ్నంగా ఊరంతా తిప్పించారు. అనంతరం కాళ్లతో తన్నుతూ అతడిని చితకబాదారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడ్ని అరెస్ట్ చేశారు. చట్టాన్ని చేతుల్లో తీసుకోకూడదని గ్రామస్థులకు వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా సమస్య ఉంటే తమకు చెప్పాలని, ఇలా చేస్తే ఇది కూడా తప్పు అవుతుందని తెలుపుతూ మేఘరాజ్‌పై దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 

Related Articles

Latest Articles