ఫోన్ నిఘాపై మాజీ ముఖ్య‌మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు…

ప్ర‌స్తుతం దేశాన్ని పెగాస‌స్ స్పైవేర్ కుదిపేస్తున్న‌ది.  దేశంలోని 300 మందికి సంబందించిన ఫోన్‌ల‌పై నిఘాను ఉంచారని, ఫోన్‌ల‌ను ట్యాపింగ్ చేశార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.  అంతేకాదు, క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్‌-జేడీఎస్ స‌ర్కార్ కూలిపోవ‌డానికి కూడా స్పైవేర్ కార‌ణ‌మ‌ని మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.  ఈ విష‌యంపై క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి, జేడీఎస్ నేత కుమార‌స్వామి స్పందించారు.  గ‌త 10-15 ఏళ్లుగా ఇలాంటివి జ‌రుగుతూనే ఉన్నాయని, ఇలాంటి వాటిని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు.  గ‌తంలో ప్ర‌భుత్వాలు, ఆదాయ‌ప‌న్ను శాఖ ప్ర‌జ‌ల ఫోన్ల‌ను ట్యాపింగ్ చేసేవార‌ని తెలిపారు.  దేశ భ‌ద్ర‌త విష‌యంలోగాని, క‌ర్ణాట‌క విష‌యంలోగాని ఎలాంటి త‌ప్పులు చేయ‌లేద‌ని అన్నారు.  దేశంలో ఏ ప్ర‌భుత్వాలైనా, ఏ పార్టీలైనా సమాచారం కోసం, లేదా త‌మ ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుకోవ‌డం కోస‌మో ఇలా చేస్తుంటార‌ని, వీటిపై త‌న‌కు ఆస‌క్తి లేద‌ని అన్నారు.  

Read: పవర్ స్టార్ ఫ్యాన్ గా సందీప్ రెడ్డి వంగా!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-