క‌ర్ణాట‌క‌లో దుమారం రేపుతున్న బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు…

క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయాలో మ‌రోసారి ర‌చ్చ చేస్తున్నాయి.  రెండేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్ర‌భుత్వం కూలిపోయిన త‌రువాత బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది.  అయితే, కాంగ్రెస్ నుంచి ప‌లువులు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయ‌డంతో సంకీర్ణ‌ప్ర‌భుత్వం కూలిపోయింది.  బీజేపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిని రెండేళ్ల త‌రువాత కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఎమ్మెల్యే శ్రీమంత్ బాలాసాహెబ్ ప‌టెల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలో పార్టీ మారేందుకు బీజేపీ పెద్ద ఎత్తున డ‌బ్బులు ఇవ్వ‌జూపార‌ని, కానీ తాను వాటిని ఆశించ‌కుండా స్వ‌చ్ఛందంగా బీజేపీలో చేరానని, ప్ర‌జాసేవ చేసేందుకు త‌న‌కు మంత్రి ప‌ద‌వి కావాల‌ని అడిగాన‌ని, కొన్ని కార‌ణాల వ‌ల‌న కుద‌ర‌లేద‌ని, ప‌టేల్ పేర్కొన్నారు.  ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి.  కోట్ల రూపాయ‌ల‌ను ఎర‌గా వేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసింద‌ని, బీజేపీపై విచార‌ణ జ‌రిపించాన‌లి కాంగ్రెస్ పార్టీ ప‌ట్టుబ‌డుతున్న‌ది.  

Read: గ‌త 70 ఏళ్లుగా ఆమె అడ‌విలోనే…ఎందుకంటే…

Related Articles

Latest Articles

-Advertisement-