డ్రైనేజీ పైప్ లో నోట్ల కట్టలు..అవినీతి విశ్వరూపం

కర్ణాటకలో కన్నింగ్ సీన్ బయటపడింది. ఓ అవినీతి సామ్రాట్ అడ్డంగా సంపాదించాడు. అనుమానం రాకుండా డ్రైనేజీ పైప్ లో నోట్ల కట్టలు దాచాడు ఆ అధికారి. అవినీతి ఎంతకాలం దాచిపెడతాడు. పాపం పండింది. కర్నాటక కలబురిగిలో జరిగిందీ ఘటన. ఏసీబీ అధికారుల తనిఖీల్లో దిమ్మ తిరిగే వాస్తవాలు బయటపడ్డాయి.

డ్రైనేజీ పైప్ లో నోట్ల కట్టలు..అవినీతి విశ్వరూపం
ఇంజనీర్ డబ్బు దాచింది ఈ పైపులోనే

అదేదో సినిమా సీన్ లా పరుపుల్లో, బాత్ రూంలో నోట్లు దాచినట్టుగా ఆ అధికారి డ్రైనేజ్ పైప్ లైన్లో డబ్బులు దాచేశాడు. ఆ నోట్ల కట్టల వాసన పట్టేశాడు అవినీతి నిరోధక శాఖ అధికారులు. ఒక డ్రైనేజ్ పైప్ ని తనిఖీ చేశారు కళ్ళు చెదిరేలా అక్షరాలా 13 లక్షల రూపాయలు దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకున్నారు. అలాంటివి ఇంకా ఏమైనా వున్నాయా అని ఆరాతీశారు. బిరాదర్ అనే పీడబ్ల్యుడీ ఇంజనీర్ అవినీతి డబ్బులివి.

Related Articles

Latest Articles