‘కర్ణన్’ తెలుగు హక్కులు బెల్లంకొండవే

ధనుష్‌ హీరోగా నటించిన ‘కర్ణన్’ సినిమా తెలుగు రీమేక్ హక్కులను బెల్లంకొండ సురేశ్ దక్కించుకున్నారు. ఏప్రిల్ 9న విడుదలైన ఈ సినిమా కోవిడ్ నిబంధనల ప్రకారం థియేటర్లలో ప్రదర్శించినా అద్భుతమైన విజయాన్ని సాధించటం విశేషం. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో కలైపులి ధాను నిర్మించిన ఈ చిత్రంలో ధనుష్ సరసన రాజీషా విజయన్ హీరోయిన్ గా నటించారు. లాల్, నటరాజసుబ్రహ్మణ్యం, యోగిబాబు, లక్ష్మీప్రియ ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్ సంగీతాన్ని అందించారు. వి క్రియేషన్స్ లో ‘అసురన్’ తర్వాత కలైపులి ధాను ధనుష్‌ తో తీసిన సినిమా ఇది. 1995లో కొడియాన్ కులమ్ లో జరిగిన వయొలెన్స్ ని బేస్ చేసుకుని తీసిన సినిమా ఇది. ఇటీవల ‘అసురన్’ సినిమాతో ధనుష్‌ కి ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు దక్కింది. ఇప్పుడు ‘కర్ణన్’ చూసిన ప్రేక్షకులు మరోసారి ధనుష్‌ కి జాతీయ అవార్డు రావటం ఖాయం అంటున్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటిన ‘కర్ణన్’ తెలుగు రీమేక్ హక్కుల కోసం గట్టిపోటీ జరిగింది. అయితే ఆ పోటీలో బెల్లంకొండ సురేశ్ గెలిచినట్లు సమాచారం. ఫ్యాన్సీ రేటుకు బెల్లంకొండ ‘కర్ణన్’ హక్కులను సొంతం చేసుకున్నాడట. మరి బెల్లంకొండ ఈ సినిమాను తన కుమారుడుతో రీమేక్ చేస్తాడా? లేక వేరే హీరోతో తీస్తాడా? అన్నది తేలాల్సి ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Related Articles

Latest Articles

-Advertisement-