ధనుష్‌ ‘కర్ణన్’కు మరో గౌరవం!

ఈ యేడాది ఏప్రిల్ లో విడుదలైన ‘కర్ణన్’ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ సైతం పొందింది. ధనుష్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాను మారి సెల్వరాజ్ దర్శకత్వంలో కలైపులి ఎస్. థాను నిర్మించారు. ఈ సినిమా ‘న్యూ జనరేషన్స్ – ఇండిపెండెంట్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఫ్రాంక్‌ఫర్ట్’కు ఎంపికైంది. నవంబర్ 12, 13, 14 తేదీలలో ఈ చిత్రోత్సవం జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ లో జరుగబోతోంది. ప్రస్తుతం ‘కర్ణన్’ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉంటే ‘కర్ణన్’ దర్శకుడు మారి సెల్వరాజ్ తో మరో సినిమా చేయబోతున్నట్టు ధనుష్‌ ఇటీవల ప్రకటించాడు. మరో విశేషం ఏమంటే… ఈ సినిమా త్వరలో తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రీమేక్ కాబోతోంది.

ధనుష్‌ 'కర్ణన్'కు మరో గౌరవం!

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-