పేదలను ఆదుకునే ప్రభుత్వం రావాలి…

తెలంగాణ మున్నూరు కాపు సంఘం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామయాత్రకు సంపూర్ణ మద్దతు తెలిపింది. సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుక్క వేణుగోపాల్ ఆధ్వర్యంలో సంజయ్ ను కలిశారు మున్నూరుకాపు నేతలు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… రాష్ట్ర మున్నూరు కాపు సంఘం బీజేపీ యాత్రకు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉంది. టీఆర్ఎస్ దుర్మార్గ పాలన పోవాలని రాష్ట్రంలోని అన్ని కుల సంఘాల నాయకులు కుల సంఘాల ప్రజలు రాజకీయాలకతీతంగా తనను వచ్చి కలిసి యాత్రకు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. పేదలను ఆదుకునే ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి తెలంగాణలో 2023 లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని పేర్కొన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-