హుజురాబాద్ ఉప ఎన్నిక : మార్గ దర్శకాలు విడుదల చేసిన కలెక్టర్

హుజురాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ ఖరారు అయిన నేపథ్యం లో కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. హుజురాబాద్ ఆర్డీవో రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉంటారని… హుజురాబాద్ వ్యాక్సినేషన్ జరుగుతుందన్నారు. హుజురాబాద్ లో 70 సింగిల్ వ్యాక్సినేషన్ జరిగింది 50 శాతం సెకండ్ వ్యాక్సినేషన్ జరిగిందని… అక్టోబర్ 30న ఎన్నిక జరుగుతుందని వెల్లడించారు. నవంబర్ 2 న కౌంటింగ్ జరుగుతుందని… సోషల్ డిస్టెన్స్ మాస్క్ తో పాటు కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. వీణవంక, జమ్మికుంట, హుజురాబాద్, కమలాపూర్, ఇళ్లందకుంట వ్యాప్తంగా ఎన్నికల ఆంక్షలుంటాయన్నారు. ఎలక్షన్ కోడ్ తక్షణమే అమలులోకి వచ్చిందని… ఎన్నికల్లో పనిచేసే ఉద్యోగులకు పోలింగ్ ఏజెంట్లకు వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉండాలని తెలిపారు. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు సైతం వ్యాక్సిన్ వేపించుకోవాలని… నామినేషన్ అభ్యర్థులు పరిమితి సంఖ్యలో రావాలి కోవిడ్ అంక్షలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.

-Advertisement-హుజురాబాద్ ఉప ఎన్నిక :  మార్గ దర్శకాలు విడుదల చేసిన కలెక్టర్

Related Articles

Latest Articles