ముంబైలో ‘సైజ్ జీరో’ పిల్లా! ఢిల్లీలో ‘సైజ్ జీరో’ పిజ్జా!

‘సైజ్ జీరో’ అంటూ కొన్ని రోజులు సినిమా, ఫ్యాషన్ రంగాలు ఊగిపోయాయి. ఎందుకో తెలుసా? అప్పట్లో కరీనా కపూర్ ‘సైజ్ జీరో’ ఫిగర్ తో సంచలనం రేపింది! ఆమె సన్నగా, పూల తీగలా మారిపోవటంతో ‘తషన్’ సినిమా తరువాత బాలీవుడ్ లో ‘సైజ్ జీరో’ మంటలు భగ్గున మండాయి. ఆ సెగకి చాలా మంది ఇతర హీరోయిన్లు కూడా తమ కొవ్వుని కరిగించేశారు. కొన్నాళ్ల పాటూ ఎక్కడ చూసినా చక్కని భామలు చిక్కిపోయి కనిపించారు. అయితే, ఇంత దుమారానికి కారణమైన బెబోగారి జీరో ఫిగర్ ఢిల్లీలోని ఓ పిజ్జా షాపు మీద కూడా ఎఫెక్ట్ చూపించింది!

దేశ రాజధానిలో ఓ పిజ్జా సెంటర్ ఉంది. అందులో మెనూ చూస్తే అప్పట్లో ‘సైజ్ జీరో’ పిజ్జా అని ఒక ఐటెం కనిపించేది! ఇంతకీ, దాని ప్రత్యేకత ఏంటంటే… అది మిగతా పిజ్జాల కంటే ఆరోగ్యకరమైనది! డైట్ కంట్రోల్లో ఉన్న వారు కూడా ఒకటో రెండో స్లైసెస్ తినేయవచ్చు! ఎందుకంటే, ‘సైజ్ జీరో’ పిజ్జాలో క్రస్ట్ సన్నగా ఉంటుంది. అలాగే, పైన డైస్డ్ చికెన్ వాడతారు. రెడ్ చిల్లీస్, ఆనియన్స్, లో ఫ్యాట్ చీస్ కూడా ‘సైజ్ జీరో’లో ఉపయోగిస్తారు! వీటి వల్ల మరీ ఇబ్బందేం ఉండదు కాబట్టి ఒకటో, రెండో స్లైసెస్ లాగించేయవచ్చు!

‘తషన్’ సినిమా తరువాత కొన్నాళ్లకి కరీనా మళ్లీ మామూలు సైజ్ కి వచ్చేసింది. జీరో ఫిగర్ క్రేజ్ కూడా తగ్గిపోయింది. బహుశా ఇప్పుడు ఢిల్లీలో ‘సైజ్ జీరో’ పిజ్జా కూడా ఉండకపోవచ్చు. కానీ, కొన్నాళ్లు మాత్రం జనాల్ని ఇటు జీరో సైజ్ పిచ్చి, అటు జీరో పేరుతో అమ్ముడయ్యే పిజ్జా… రెండూ మాయ చేసేశాయి!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-