‘మామూలు’ సినిమాలకు 6 కోట్లే! ‘ఆ సినిమా’కి 12 కోట్లు కావాలట!

హీరోలతో సమానంగా హీరోయిన్స్ కూడా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు! అందరూ కాకున్నా ఒకరిద్దరు స్టార్ బ్యూటీస్ హీరోలకు ఏ మాత్రం తీసిపోవటం లేదు. పైగా గతంలో పెళ్లైతే సదరు హీరోయిన్ కెరీర్ ముగిసినట్టే! పిల్లలు కూడా పుడితే… మమ్మీగారు ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తాల్సిందే! కానీ, ఇదంతా కరీనా కపూర్ కి వర్తించదు! మిసెస్ సైప్ మారిన తరువాత రెండు సార్లు మమ్మీ అయిన ఈ యమ్మీ బ్యూటీ ఓ సినిమా కోసం ఏకంగా 12 కోట్లు అడిగిందట!

అలౌకిక్ దేశాయ్ దర్శకత్వంలో రాబోతోన్న భారీ బడ్జెట్ మూవీ ‘రామాయణం’. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… కరీనా కపూర్ సీతగా నటిస్తుందని టాక్ వినిపిస్తోన్న ఈ మైథలాజికల్ మూవీ రాముడి కథ కాదు! సీత దృష్టిలో సాగే ‘రామాయణం’. అంటే… ఒక విధంగా ‘సీతాయణం’ అన్నమాట! మరి సీతే ప్రధానం కాబట్టి ఆ పాత్ర పోషిస్తోన్న కరీనాకి ఎక్కువే ముట్టాలి కదా? అందుకే, 12 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. కానీ, ప్రస్తుతానికి దర్శకనిర్మాతలు బెబోని ఫైనలైజ్ చేసే విషయంలో ఆలోచనలోపడ్డారట. వాళ్ల ఫస్ట్ ఛాయిస్ ఇప్పటికీ ఆమే అయినప్పటికీ భారీగా రేటు చెప్పటంతో వెనక్కితగ్గినట్టు సమాచారం.

కరీనా తన ఫీజు తగ్గిస్తుందో లేదా ఆమె చెప్పిన భారీ మొత్తం ఫిల్మ్ మేకర్స్ చెల్లించుకుంటారో ఇప్పుడే చెప్పలేం. కానీ, రీసెంట్ గా రెండోసారి అమ్మ అయిన అందాల రాశి ఇతర చిత్రాలతోనూ ఫుల్ బిజీగా ఉంది. నెక్ట్స్ ఆమీర్ తో ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో కనిపించనుంది. ‘వీరే ది వెడ్డింగ్ 2’, హన్సల్ మెహతా చిత్రంలోనూ మిసెస్ ఖాన్ మెరిసిపోనుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-