రణవీర్ సింగ్ ‘లంక’లో కరీనా కపూర్? ‘సీతా’ మూవీ కోసం కొనసాగుతోన్న చర్చలు…

రణవీర్ సింగ్ అనగానే మనకు బోలెడు పాత్రలు గుర్తుకు వస్తాయి. వరుస సక్సెస్ లతో ఆయన ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగాడు. అయితే, ‘పద్మావత్’ సినిమాలో ఆయన అల్లావుద్దీన్ ఖిల్జీగా నెగటివ్ రోల్ చేశాడు. దానికి ఆయనకు బాగా పేరొచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి రణవీర్ కి సూపర్ ఆఫర్ వచ్చిందని టాక్. ఈసారి కూడా నెగటివ్ రోల్ లో రావణుడుగా కనిపించబోతున్నాడట రణవీర్ సింగ్!
దర్శకుడు రాజమౌళి తండ్రి, సీనియర్ రచయిత విజయేంద్ర ప్రసాద్ ‘సీతా’ పేరుతో రామాయణగాథని మరోమారు చెప్పబోతున్నారు. అయితే, తల్లి సీతమ్మ దృక్కోణంలో సాగే ‘సీతా’ మూవీ బాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ మెగా మైథలాజికల్ ప్రాజెక్ట్ లో కరీనా లేదా ఆలియా సీతగా కనిపిస్తారని టాక్. ఇప్పటి దర్శకుడు అలౌకిక్ దేశాయ్ బెబోని ఒప్పించడని అంటున్నారు. అలాగే, రణవీర్ కూడా ప్రస్తుతానికి రావణుడి పాత్ర చేయటానికి ఓకే అన్నాడని ముంబై సమాచారం. అంతా అనుకున్నట్టు వర్కవుటైతే కరీనా, రణవీర్ ఒకే సినిమాలో నటించటం ఇదే మొదటిసారి అవుతుంది! గతంలో ‘రామ్ లీలా’ సినిమాలో వీరిద్దరూ రొమాన్స్ చేయాల్సింది. కానీ, ప్లాన్ వర్కవుట్ కాలేదు. దీపికతో రణవీర్ బ్లాక్ బస్టర్ అందించాడు!

Related Articles

Latest Articles