ట్రోఫీ గెలవలేదు కాబట్టి 10 మార్కులు కట్

టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి పదవీ కాలం ముగిసింది. దీంతో అతడి పనితీరుపై మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ విశ్లేషించాడు. రవిశాస్త్రి కోచ్‌గా ఉన్నంతకాలం క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో టీమిండియాకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. రవిశాస్త్రి-విరాట్ కోహ్లీ కాంబినేషన్‌కు తాను 100కు 90 మార్కులు వేస్తానని కపిల్ అన్నాడు. వారిద్దరూ ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు కాబట్టి 10 మార్కులు కట్ చేసినట్లు వివరించాడు.

Read Also: కుంబ్లే స్థానంలో ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌ గా గంగూలీ

ఐసీసీ ట్రోఫీ మాట పక్కనబెడితే రవిశాస్త్రి-విరాట్ కోహ్లీ భాగస్వామ్యంలో 5 సంవత్సరాలు టీమిండియా బాగా రాణించిందని కపిల్ దేవ్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌లు కైవసం చేసుకుందని కపిల్ గుర్తుచేశాడు. 2007 వన్డే వరల్డ్ కప్ తర్వాత అంతటి స్థాయిలో టీమ్ నిరాశపరిచింది ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో మాత్రమేనని కపిల్ అభిప్రాయపడ్డాడు. కనీసం సెమీఫైనల్‌కు చేరకపోవడం తనకు అసంతృప్తిని కలిగించిందని కపిల్ పేర్కొన్నాడు. కాగా రవిశాస్త్రి కోచ్‌గా 2017లో బాధ్యతలు చేపట్టగా.. 2021లో ఆయన పదవీకాలం ముగిసింది.

Related Articles

Latest Articles