’83’ టీజర్: కపిల్ హైలెట్‌ క్యాచ్.. ఇండియా జిందాబాద్

టీమిండియాను ప్రపంచ ఛాంపియన్ గా నిలబెట్టిన గ్రేట్ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ గా తెరకెక్కుతున్న చిత్రం ’83’. ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులతో పాటు క్రీడా అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఈ బయోపిక్ లో కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటిస్తుండగా ఆయన భార్య పాత్రలో దీపికా పడుకొనే సందడి చేయనుంది. 1983 క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ విషయానికొస్తే ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

వెస్టిండీస్ పై వరల్డ్ కప్ ఫైనల్ పోరులో కపిల్ దేవ్ క్యాచ్ పట్టిన తీరు అందరిని ఉత్కంఠకు గురిచేస్తోంది. ఇక క్రికెట్ అభిమానులు ఇండియా గెలవగానే ఇండియా జిందాబాద్ అంటూ కేకలు వేయడం ఎంతో ఉద్వేగానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. కపిల్ దేవ్ గా రణవీర్ సింగ్ నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పాలి. నవంబర్ 30 న ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇకపోతే ఈ చిత్ర నిర్మాణంలో హీరోయిన్ దీపికా పడుకొనే కూడా ఒక చేయి వేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 24 దేశ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది.

Related Articles

Latest Articles