కాన్పూర్ టెస్ట్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?

కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌ను 234/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దీంతో న్యూజిలాండ్ ముందు 284 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. తీవ్ర ఒత్తిడి నెలకొన్న దశలో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (61 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. శ్రేయాస్ అయ్యర్ (65), అశ్విన్ (32), పుజారా (22), అక్షర్ పటేల్ (28 నాటౌట్) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ, జేమీసన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. 2017 తర్వాత సాహాకు టెస్టుల్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.

Read Also: కాన్పూర్ టెస్టులో శ్రేయాస్ అయ్యర్ రికార్డు

నాలుగో రోజు న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయడానికి 4 ఓవర్లు మాత్రమే మిగిలాయి. స్పిన్‌కు అనూకులిస్తున్న ఈ పిచ్‌పై నిలవాలంటే ఐదో రోజు కివీస్ జట్టు ఎంత సేపు పోరాడుతుందో వేచి చూడాలి. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 345 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 296 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 49 పరుగులు కలుపుకుని న్యూజిలాండ్ ముందు 284 పరుగుల టార్గెట్ నిలిచింది.

Related Articles

Latest Articles