“కన్నులు చెదిరే” మెలోడీ సాంగ్ విడుదల చేయనున్న ‘మేజర్’

కె.వి.గుహన్ దర్శకత్వంలో ఆది తరుణ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ”. హూ వేర్ వై అనేది దాని అర్థం. ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో ప్రియదర్శి, వివా హర్ష, దివ్య, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను డాక్టర్ రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మిస్తున్నారు. రామంత్ర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం నుంచి ఇటీవలే “లాక్ డౌన్” అనే ట్యాప్ సాంగ్ ని విడుదల చేశారు. తెలుగులో విడుదలైన ఈ వీడియో సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. రోల్ రైడ ఈ ర్యాప్ సాంగ్ ని ఆలపించారు. సైమన్ కె కింగ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. తాజాగా ఈ చిత్రం నుంచి “కన్నులు” చెదిరే అనే మెలోడీ సాంగ్ ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. మే 29న ఉదయం 11 గంటల 5 నిమిషాలకు అడివి శేష్ ఈ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-