సీనియర్ నటుడిని బలి తీసుకున్న కరోనా

ప్రముఖ కన్నడ సీనియర్ నటుడు సురేష్ చంద్ర కరోనాతో శుక్రవారం కన్నుమూశారు. గత కొన్ని వారాలుగా కరోనాతో బాధపడుతున్న ఆయనను బెంగళూరులోని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆయన పరిస్థితి క్రిటికల్ గా మారడంతో శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన కెరీర్‌లో 50కి పైగా కన్నడ చిత్రాల్లో నటించారు సురేష్ చంద్ర. విలన్ పాత్రలకు పేరుగాంచిన సురేష్ నటుడిగా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. చెలువినా చిత్తారా, ఉగ్రమ్ వంటి కన్నడ చిత్రాలలో విలన్ గా నటించి ప్రేక్షకులకు ఆకట్టుకున్నారు. కిచా హుచ్చా, రానా, షైలూ, కాళిదాస కన్నడ మేష్త్రు, అప్పయ్య, జంగ్లీ వంటి పలు హిట్ చిత్రాలలో కూడా నటించారు. ఆయన చివరిసారిగా 2019లో ‘కాళిదాస కన్నడ మేష్త్రు’ అనే చిత్రంలో కన్పించారు. సురేష్ చంద్ర మరణవార్త తెలిసిన సినిమా ప్రముఖులు ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-