టిడిపి హయాంలో కేసీఆర్ సహా పలువురిపై రాజద్రోహం కేసులు : కన్నబాబు

టిడిపిపై వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ఫైర్ అయ్యారు. యనమల రామకృష్ణుడు,లోకేష్ లు ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని..తెదేపా పరిస్థితిపై ఆందోళనతోనే ప్రెస్టేషన్ లో యనమల మాట్లాడినట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. తెదేపా హయాంలో 68వేల కోట్లు తినేశారని..ప్రజలను మోసం చేసి ఇప్పుడొచ్చి నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. తెదేపా హయాంలో 1.50 లక్షల కోట్లు అప్పులు చేశారని..తెదేపా హయాంలో చేసిన అప్పులు దేని కోసం ఖర్చులు చేశారో యనమల చెప్పాలని చురకలు అంటించారు. తెదేపా హయాంలో కేసీఆర్ సహా పలువురిపై 30-40 రాజద్రోహం కేసులు పెట్టారని.. కుక్కలు చింపిన విస్తర లాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెదేపా తయారు చేసిందని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు అంతా ఒక డ్రామా అని.. ఒక్కరోజు అసెంబ్లీకి రాని తెదేపా నేతలకు బడ్జెట్ పై విమర్శించే హక్కు లేదన్నారు. అన్ని వర్గాల సమతుల్యత, శ్రేయస్సు కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు కన్నబాబు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-