ఇండియన్స్ కోసం ‘అమెరికన్ టెంప్టేషన్’ అరువు తెస్తోన్న కంగన!

సౌత్ ఇండస్ట్రీస్ లో కంటే బాలీవుడ్ లో ఓటీటీల జోరు బాగానే ఉంది. సినిమాలు, సిరీస్ లు, రకరకాల షోస్ తో బీ-టౌన్ బిగ్గీస్ వరుసగా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పైకి క్యూ కడుతున్నారు. లెటెస్ట్ ఇన్ ద లైన్… మరెవరో కాదు… మన ‘తలైవి’ కంగనా రనౌత్!

త్వరలో వెండితెర మీద జయలలితగా అలరించబోతోన్న ముంబై ‘తలైవి’ కంగనా ఒక రియాల్టీ షో హోస్ట్ చేయబోతోందట. ఆల్రెడి అగ్రిమెంట్ పేపర్స్ పై సైన్ కూడా చేసిందట. అయితే, ఇంకా వివరాలేవీ అధికారికంగా బయటకు రాలేదు. కాకపోతే, అమెరికన్ రియాల్టీ షో ‘టెంప్టేషన్ ఐల్యాండ్’ ప్రేరణతో కంగనా నిర్వహించే షో కొనసాగుతందని సమాచారం వస్తోంది. కొందరు జంటలు, మరికొందరు సింగిల్స్ ఒకేచోట ఉంటారు. వారి మధ్య బంధాల్ని, అనుబంధాల్ని వివిధ రకాలుగా షో నిర్వాహకులు పరీక్షిస్తారు. ఇదే కంగనా హోస్ట్ చేయబోయే షోలోని థీమ్!కాంట్రవర్సీకి కేరాఫ్ అయిన మన ‘క్వీన్’ తన రియాల్టీ షోని ఎలా నిర్వహిస్తుందో చూడాలి! ఒక్కసారి మొదలైతే కంగనా షోలో కలహాలకి బోలెడంత స్కోప్ ఉండే ఛాన్సే కనిపిస్తోంది! లెట్స్ వెయిట్…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-