కంగనా ‘పాప్ కార్న్’ వినోదం… ‘బ్లాక్ విడో’ వీక్షించిన బాలీవుడ్ ‘క్వీన్’!

వీకెండ్ రాగానే సినిమాకి వెళ్లటం చాలా మందికి చాలా ముఖ్యమైన విషయం! కానీ, రెండేళ్లుగా కరోనా మహమ్మారి పుణ్యం కొద్దీ పెద్దతెర కాస్త పెద్ద గండంగా మారిపోయింది. మూతపడ్డ థియేటర్లు ఎంతకూ తెరుచుకోవటం లేదు. అయితే, బిగ్ స్క్రీన్ పై బిగ్ ఎంటర్టైన్మెంట్ మనమే కాదు… బిగ్ బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా మిస్ అవుతున్నారు! మనం థియేటర్ కు వెళ్లి చూసే హీరోలు, హీరోయిన్స్ కూడా థియేటర్స్ కు వెళ్లలేకపోతున్నామని బెంగపెట్టుకుంటున్నారు. అయితే, కంగనాకి మాత్రం ఎట్టకేలకు ‘బిగ్’ రిలీఫ్ దొరికేసింది…
‘ధక్కడ్’ సినిమా కోసం ప్రస్తుతం బుడాపెస్ట్ నగరంలో ఉంది కంగనా రనౌత్. అర్జున్ రాంపాల్ విలన్ గా నటిస్తున్నాడు. అతనితో పాటూ కలసి యాక్షన్ సీక్వెన్సెస్ షూట్ చేస్తోన్న ‘క్వీన్’ ఆఫ్ బాలీవుడ్… థియేటర్ కు వెళ్లింది. స్కార్లెట్ జోహాన్సన్ సూపర్ హీరో మూవీ ‘బ్లాక్ విడో’ చూసింది. చేతిలో రెండు పాప్ కార్న్ టబ్స్ పట్టుకుని ఖుషీ ఖుషీగా కెమెరాకు ఫోజిచ్చింది! అంతే కాదు, ‘తలైవి’ ఆఫ్ ముంబై తన బుడాపెస్ట్ మూవీ ఔటింగ్ గురించి సొషల్ మీడియాలో పోస్ట్ చేసింది! ‘పాప్ కార్న్ డేస్ ఆర్ బ్యాక్’ అంటూ క్యాప్షన్ ఇచ్చిన కంగనా ‘బ్లాక్ విడో’ సినిమా చూసే ఏర్పాటు చేసిన ప్రొడ్యూసర్స్ కి ధన్యవాదాలు తెలిపింది. రెండేళ్ల తరువాత మళ్లీ థియేటర్ హాల్ లోపలికి, పెద్ద తెర ముందుకి చేరుకున్నందుకు ఫుల్ హ్యాపీగా కనిపించింది మిస్ ‘మణికర్ణిక’!
త్వరలో ‘తలైవి’గా జయలలిత బయోపిక్ తో రాబోతోన్న కంగనా రనౌత్ ‘ధక్కడ్’ సినిమాలో ఏజెంట్ అగ్ని పాత్ర పోషిస్తోంది. అర్జున్ రాంపాల్ రుద్రవీర్ గా యాంటాగనిస్ట్ రోల్ లో కనిపిస్తాడు. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ లో కంగనా కలకలం రేపబోతోంది!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-