నీలి చిత్రాల కేసులో శిల్పా భర్త అరెస్ట్! సినిమా తీస్తానని ప్రకటించిన కంగనా!

‘సాగరకన్య’గా తెలుగు వారికి పరిచయమున్న శిల్పా శెట్టి అనూహ్యంగా ఇబ్బందుల్లో పడింది. ఆమె భర్తని పోలీసులు అరెస్ట్ చేశారు. పైగా ఆయన మీద నమోదైన కేసు అశ్లీల చిత్రాల నిర్మాణం, ప్రదర్శనకి సంబంధించింది కావటంతో అందరూ షాక్ కి గురయ్యారు. అయితే, ఈ వివాదంలో కంప్లైంట్ ఫిబ్రవరీలోనే నమోదైంది. కానీ, అరెస్ట్ మాత్రం జూలై 19 రాత్రి వేళ జరిగింది. భర్త అరెస్టుతో శిల్పా శెట్టి ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి దాపురించింది. ఆమె ఇప్పుడు బయటకు వస్తే తన మీద ప్రశ్నల వర్షం కురిసే అవకాశం ఉంది…

Read Also: ‘నారప్ప’కు సమంత ప్రశంసలు

బూతు చిత్రాలు తీసి వాట్ని వివిధ యాప్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేశాడని రాజ్ కుంద్రాపై ఆరోపణలు వస్తున్నాయి. అందులో నిజం ఎంతోగానీ భర్త ఇరుక్కున్న వివాదం భార్య శిల్పా శెట్టికి తల ఎత్తుకోలేని పరిస్థితి తెచ్చిపెట్టింది. ఆమె రెగ్యులర్ గా జడ్జ్ చేసే ‘సూపర్ డ్యాన్సర్ 4’ రియాల్టీ షోలో ఎక్కడా కనిపించలేదు. అలాగే, ‘హంగామా 2’ సినిమా విడుదలకి ముందు ఆమె ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొనాల్సి ఉంది. అవి కూడా శిల్పా క్యాన్సిల్ చేసుకుందట.

Read Also: కారెక్కిన కౌశిక్‌రెడ్డి.. కండువా కప్పిన కేసీఆర్

శిల్పా శెట్టి భర్త రకరకాల వ్యాపారాలు చేస్తూ కోట్లు గడిస్తున్నాడు. ఆయన ఆన్ లైన్ లో అశ్లీల చిత్రాల దందా చేయటం నిజంగా షాకింగ్ విషయమే. అయితే, ఒక్కో రోజు గడుస్తునకొద్దీ కొత్త నిజాలు బయటకొస్తున్నాయి. ఇంటర్నెట్ లో తమ న్యూడ్ వీడియోస్, ఫోటోస్ తో హల్ చల్ చేసే పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రా కూడా రాజ్ కుంద్రా క్లైంట్సేనట! పూనమ్ పాండే సెక్స్ కంటెంట్ యాప్ ను కుంద్రాకు సంబంధించిన కంపెనీయే నిర్వహించేది! కానీ, డబ్బుల విషయంలో గొడవలొచ్చి పూనమ్ పాండే అగ్రిమెంట్ నుంచీ తప్పుకుంది. మరో వైపు, షెర్లీన్ చోప్రా కూడా తనకు 30 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ ఇచ్చి రాజ్ కుంద్రా 15 నుంచీ 20 అడల్ట్ ప్రాజెక్ట్స్ చేయించుకున్నాడని ఒప్పుకుందట!

శిల్పె శెట్టి భర్త పోర్నోగ్రపీ కేసులో ఇరుక్కోవటంతో కంగనా కూడా పెదవి విప్పింది. దేని గురించైనా ఓపెన్ గా మాట్లాడే ‘తలైవి’ ఆఫ్ బాలీవుడ్… ఈసారి మొత్తం ఇండస్ట్రీని టార్గెట్ చేసింది. బాలీవుడ్ కాదు బులీవుడ్ అంటూ… ముంబై చిత్ర పరిశ్రమని గట్టర్ తో పోల్చింది! అంతా కంపు, చెత్తే అంటూ తిట్టిపోసింది. తన నెక్ట్స్ మూవీ ‘టీకు వెడ్స్ షేరు’లో బాలీవుడ్ చీకటి కోణాల్ని చూపిస్తానని ప్రకటించింది!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-