యూపీ సీఎంను కలిసిన కంగనా రనౌత్

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లక్నోలో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఈ సమావేశం చర్చనీయాంశంగా మారింది. ఇక కంగనా కూడా బీజేపీ భావజాలానికి మరింత దగ్గర అవుతున్న సంగతి తెలిసిందే. ఆమె రాజకీయ ప్రవేశం లేకున్నాను, మద్దతు తెలియజేసే అవకాశం కనిపిస్తోంది.

యూపీ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, మహిళా భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కంగనా అభినందించారు. ఈ భేటీ సందర్భంగా యోగి ఆమెకు అరుదైన బహుమతిని అందజేశారు. అయోధ్యలోని రామమందిర నిర్మాణం కోసం భూమి పూజలో ఉపయోగించిన శ్రీరామచంద్రుడి నాణేన్ని ఆమెకు బహుమతిగా అందించారు. కాగా, యూపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్’ కార్యక్రమానికి కంగనాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.

-Advertisement-యూపీ సీఎంను కలిసిన కంగనా రనౌత్

Related Articles

Latest Articles