పొలిటికల్ ఎంట్రీ గురించి కంగనా కామెంట్స్

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన “తలైవి” షూటింగ్ ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో జాతీయ అవార్డ్ విజేత కంగనా నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కంగనా రాజకీయ ఎంట్రీ గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిన్న “తలైవి” కోసం ఢిల్లీలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కంగనా తన పొలిటికల్ ఎంట్రీ గురించి చేసిన ఆసక్తికర కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read Also : విజయవాడ దుర్గమ్మను దర్శించిన సోనూసూద్

రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తున్నారా ? అని కంగనాకు ఓ విలేఖరి ప్రశ్నించగా… కంగనా మాట్లాడుతూ “నేను ఎప్పుడూ దేశం కోసం మాట్లాడతాను. కాబట్టి నేను రాజకీయాల కోసం మాట్లాడుతున్నానని భావిస్తారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే నేను రాజకీయ నాయకుడిని కాదు, బాధ్యతాయుతమైన పౌరురాలిగా మాట్లాడుతున్నాను. ప్రజల మద్దతు కారణంగా నేను ఎక్కడికి చేరుకున్నా నేను ప్రజలకు, దేశానికి అనుకూలంగా మాట్లాడతాను. నేను రాజకీయాల్లో చేరాలనుకున్నా, అనుకోకపోయినా అది నా నిర్ణయం కాదు. ప్రజల మద్దతు లేకుండా, మీరు పంచాయతీ ఎన్నికల్లో కూడా గెలవలేరు. ప్రస్తుతం నేను ఒక నటిగా సంతోషంగా ఉన్నాను. రేపు ప్రజలు నన్ను రాజకీయ నాయకురాలిగా చూడాలనుకుంటే, నేను ప్రజలచే ఎన్నుకోబడితే నేను ఖచ్చితంగా పొలిటికల్ లీడర్ గా రాణించడానికి ఇష్టపడతాను” అంటూ చెప్పుకొచ్చింది.

Related Articles

Latest Articles

-Advertisement-