‘పుష్ప’ సినిమాను వీక్షించిన విశ్వనటుడు.. ఫొటోస్ వైరల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది. ఇక ఇటీవల అమెజాన్ లో స్ట్రీమింగ్ అయినా ఈ సినిమా ఇక్కడ కూడా రికార్డుల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ సినిమాను పలువురు ప్రముఖులు వీక్షించి ప్రశంసలు అందిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాను తాజగా విశ్వ నటుడు కమల్ హాసన్ వీక్షించారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ప్రత్యేకంగా కమల్ హాసన్ కి పుష్ప సినిమాను చూపించారు. ఈ విషయాన్ని దేవి శ్రీ ప్రసాద్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

” డియరెస్ట్ ఉలగనయగన్ కమల్ హాసన్ సర్ ధన్యవాదాలు.. మాకోసం మీ సమయాన్ని వెచ్చించి పుష్ప సినిమా చూసినందుకు.. మీరు చాలా స్వీటెస్ట్.. సినిమా చూసి మా పనితనం గురించి మీరు చెప్పిన మాటలు అద్భుతం” అని చెప్పుకొచ్చారు. ఇక ఈ ట్వీట్ కి అల్లు అర్జున్ స్పందిస్తూ ” పుష్ప సినిమా వీక్షించినందుకు ధన్యవాదాలు కమల్ హాసన్ సార్.. హంబుల్డ్” అని తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Related Articles

Latest Articles