‘దశావతారా’నికి ఆ దర్శకులంతా ‘దండం’ పెట్టి పక్కకు తప్పుకున్నారు! ఎందుకంటే…

‘దశావతారం’ సినిమా 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. సినిమాలో కమల్ పది పాత్రలు చేసి రికార్డ్ సృష్టించాడు. అంతకు ముందు ‘నవరాత్రి’ సినిమాలో శివాజీ గణేశన్ తొమ్మిది పాత్రలు చేశాడు. తెలుగులోనూ ‘నవరాత్రి’ మూవీలో అక్కినేని తొమ్మిది పాత్రలు చేసి మెప్పించాడు. అయితే, కమల్ ‘దశావతారాల’తో తన దమ్మేంటో 13 ఏళ్ల కింద బాక్సాఫీస్ వద్ద నిరూపించాడు. 200 కోట్లతో అప్పట్లో ఆ సినిమా హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచి రజనీకాంత్ ‘శివాజీ’ రికార్డుల్ని బ్రేక్ చేసింది!
‘దశావతారం’ తెరపై చూసిన మనకు కమల్ పది పాత్రల్లోనే తెలుసు. కానీ, ఆయన తెర వెనుక రచయిత పాత్ర కూడా పోషించాడు. ‘దశావతారం’ సినిమాకి కథ, కథనం ఆయనదే. కానీ, దర్శకత్వం మాత్రం కేఎస్ రవికుమార్ నిర్వహించాడు. అంతకంటే ముందు కమల్ హాసన్ తన స్టోరీని పట్టుకుని చాలా మంది వద్దకి వెళ్లడాట. ఏ ఒక్క డైరెక్టర్ కూడా ‘దశావతారం’ తెరపై ఆవిష్కరించేందుకు ముందుకు రాలేదట. తమకు స్టోరీ అంతగా అర్థం కాలేదని వారంతా చెప్పారట. ఆశ్చర్యకరంగా రవికుమార్ మాత్రం కథ విన్న తొలి సందర్భంలోనే సినిమాను తెరకెక్కిస్తానని ముందుకొచ్చాడని కమల్ చెప్పాడు. అసలు ఇలాంటి విభిన్నమైన కథని మిగతా దర్శకులు ఎందుకు కాదన్నారని రవికుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడట.
‘దశావతరం’ సినిమాలో తాను పది పాత్రలు చేసినప్పటికీ మిగతా సమయాల్లోనూ సెట్స్ మీదే ఉండి కమల్ పర్యవేక్షించేవాడట. సినిమాని ప్రతీ దశలోనూ జాగ్రత్తగా చూసుకున్నందుకే ‘దశావతారం’ అంత గొప్పగా వచ్చిందని ఆయన ఆన్నాడు!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-