కమల్ కి అడ్డంకిగా మారిన సూర్య….

కోవిడ్ ఇబ్బందులు ఇంకా పూర్తిగా పోలేదు. థియేటర్లు తెరుచుకున్నా, షూటింగ్ లు కొనసాగుతున్నా కరోనా కలవరం అందర్నీ వేధిస్తూనే ఉంది. ఇప్పుడు అదే సమస్య సూర్య, కమల్ హాసన్ మధ్య కూడా వచ్చింది. మహమ్మారి ఎఫెక్ట్ తో కమల్ హాసన్ కొద్ది రోజులు తన చిత్రాన్ని వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. అయితే, అందుక్కారణం హీరో సూర్య కావటమే కోలీవుడ్ లో చర్చగా మారింది.

సూర్య ‘ఎతరుక్కుమ్ తునిందవా’ సినిమా చేస్తున్నాడు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం తమిళనాడులోని కారైకుడి ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు, లోకేశ్ కనకరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్ నటిస్తోన్న చిత్రం ‘విక్రమ్’. ఇది కూడా ఆగస్ట్ 20 నుంచీ కారైకుడి ఏరియాలోనే పిక్చరైజేషన్ జరుపుకోవాలి. కానీ, అప్పటికి సూర్య మూవీ షెడ్యూల్ పూర్తవ్వదు. మరి ఎలా? స్థానిక అధికారులేమో కారైకుడిలో ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ కి నో అంటున్నారట. కరోనా వైరస్ ఇంకా ఆందోళన పెడుతుండటంతో ఇద్దరు స్టార్ హీరోల షూటింగ్ తాలూకూ హడావిడి మంచిది కాదని వారు అభిప్రాయపడుతున్నారట.

సూర్య, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా రూపొందుతోన్న ‘ఎతరుక్కుమ్ తునిందవా’ కారైకుడి షెడ్యూల్ ముగిశాకే కమల్ హాసన్ స్టారర్ ‘విక్రమ్’ ముందుకు సాగనుంది. కాబట్టి సూర్య మూవీ వల్ల కమల్ కి కొన్నాళ్ల పాటూ డిలే తప్పటం లేదు…

-Advertisement-కమల్ కి అడ్డంకిగా మారిన సూర్య….

Related Articles

Latest Articles