సల్మాన్ ఖాన్ ‘నా కాళ్లు పట్టుకున్నా వదిలేది లేదు!’ అంటోన్న మరో ఖాన్!

బాలీవుడ్ లో వివాదాలే ఊపిరిగా బ్రతికేసే జనాలు కొందరుంటారు. సౌత్ లో కంటే ముంబైలో స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్స్, హీరోయిన్స్ వంటి వారికి విమర్శల సెగ ఎక్కువే! సల్మాన్ ఖాన్ కు కూడా ఈ మధ్య తప్ప లేదు. ‘రాధే’ సినిమా అస్సలు బాగోలేదని చాలా మంది రివ్యూలు ఇచ్చారు. సొషల్ మీడియాలో అయితే సరేసరి! తెగ ట్రోలింగ్ చేశారు! కానీ, భాయ్ జాన్ అందర్నీ లైట్ తీసుకున్నాడు… ఒక్క కమాల్ ఆర్ ఖాన్ని తప్ప!

అప్పుడెప్పుడో ఒకటి అరా సినిమాలు చేసి ఇక ఆ తరువాత మూవీ రివ్యూస్ చేస్తూ రచ్చ చేస్తుంటాడు కమాల్ ఆర్ ఖాన్. అంతే కాదు, సొషల్ మీడియాలో ఈయన నోరు తెరిచాడంటే బీభత్సమే. ఎంతటి స్టార్ నైనా నోటికి వచ్చిన మాటలతో టార్గెట్ చేయటం కమాల్ ఆర్ ఖాన్ అలియాస్ కేఆర్కే స్టైల్. హీరోయిన్స్ నైతే వారి వ్యక్తిగత విషయాలు, ఎఫైర్స్ ప్రస్తావిస్తూ రచ్చ చేస్తాడు. తాజాగా సల్మాన్ ఖాన్ ‘రాధే’ సినిమాను కేఆర్కే రివ్యూ చేశాడు. సినిమా బాగాలేదని చెప్పటంతో పాటూ కండల వీరుడ్ని ‘కరప్ట్’ అంటూ ఆరోపించాడు. అవినీతిపరుడు అని కూడా ఊరుకోలేదు. సల్మాన్ ‘బీయింగ్ హ్యూమన్’ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. మొత్తంగా తన వ్యక్తిగత దూషణలతో ‘దబంగ్’ ఖాన్ కి కమాల్ ఆర్ ఖాన్ చిర్రెత్తించాడు. అందుకే, సల్మాన్ లీగల్ టీమ్ నుంచీ పరువు నష్టం దావా నోటీసులు అందుకున్నాడు కేఆర్కే!

తనపై కేసు నమోదైనా వెనక్కి తగ్గటం లేదు కమాల్ ఖాన్. పైగా మరింత దాడి చేస్తున్నాడు సల్మాన్ పైన! ‘రాధే’ రివ్యూ చేసినందుకే తనని టార్గెట్ చేస్తున్నారని ఆయన అంటున్నాడు. అంతే కాదు, తాను బాలీవుడ్ చరిత్రలో అత్యంత నిజాయితీపరుడైన క్రిటిక్ ని అంటున్నాడు. అందుకే, తన రివ్యూలంటే బెదిరిపోతున్నారని చెప్పుకుంటున్నాడు. పనిలో పనిగా సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ని కూడా కమాల్ ఆర్ ఖాన్ చర్చలోకి లాగాడు. ‘రాధే’ సినిమా బాగాలేదని సలీమ్ ఖాన్ కూడా అన్నాడంటూ తనని తాను సపోర్ట్ చేసుకున్నాడు. ఇక చివరగా, కేఆర్కే తనదైన స్టైల్లో రెచ్చిపోతూ… ‘’సల్మాన్ వచ్చి నా కాళ్లు పట్టుకుని వద్దన్నా కూడా ఇక మీద ఊరుకోను! ఆయన సినిమాల్ని నేను రివ్యూ చేస్తూనే ఉంటాను!’’ అన్నాడు.

కేఆర్కే మీద సల్మాన్ వేసిన పరువు నష్టం కేసు ఏమవుతుందో మనకు తెలియదుగానీ… ప్రస్తుతానికైతే జనం దృష్టి ‘రాధే’ మీద నుంచీ మళ్లకుండా ఈ వివాదం చక్కగా పనికొస్తోంది. ప్రభుదేవా డైరెక్షన్ లో వచ్చిన లెటెస్ట్ మూవీని జనం ఈపాటికి మరిచిపోయేవారే! కమాల్ ఆర్ ఖాన్ రచ్చ దెబ్బతో ఇంకా ‘రాధే’ న్యూస్ కంటిన్యూ అవుతోంది!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-