కళ్యాణ్ రామ్ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ!

నందమూరి కళ్యాణ్ రామ్ ఒక్కసారిగా తన కెరీర్ ను టాప్ గేర్ లో వేసేశాడు. మొన్న పుట్టిన రోజున వెలువడిన కొత్త సినిమాల ప్రకటనలు చూసిన వాళ్లంతా ఎంతో ఆశ్చర్యపోయారు. అయితే… ఆ సినిమాలన్నీ కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా షూటింగ్ అండ్ ప్రీ ప్రొడక్షన్ లో వివిధ దశల్లో ఉన్నాయి. కళ్యాణ్ రామ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రాజేంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమాను ఫిబ్రవరి 15వ తేదీ పూజా కార్యక్రమాలతో ప్రారంభించింది. గత యేడాది జనవరిలో ‘ఎంత మంచివాడవురా’ చిత్రంలో నటించిన తర్వాత కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ లో ‘బింబిసార’ చిత్రం మొదలెట్టారు. దాని తర్వాత కళ్యాణ్ రామ్ చేయబోతున్న చిత్రం ఇదే.

ఇది ఆయనకు 19వ చిత్రం కాగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో 14వ సినిమా. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకు ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. దీనికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. ఈ విషయాన్ని గిబ్రాన్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తెలుగులో ‘రన్ రాజా రన్’, ‘జిల్’ వంటి మ్యూజికల్ హిట్స్ కు వర్క్ చేసిన గిబ్రాన్ ఎక్కువగా తమిళ చిత్రసీమ మీదే ఫోకస్ పెడుతున్నాడు. అటు కళ్యాణ్ రామ్ నటిస్తున్న సినిమాకు, ఇటు మైత్రీ మూవీ మేకర్స్ కు గిబ్రాన్ సంగీతం అందించడం ఇదే మొదటిసారి. అయితే ప్రస్తుతం గిబ్రాన్… మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతున్న ‘హీరో’ చిత్రానికీ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-