ఇక ఆ అక్కినేని హీరోతో ‘బంగార్రాజు’ సీక్వెల్ లేదట !

కింగ్ నాగార్జున, అక్కినేని నాగ చైతన్య తమ కొత్త చిత్రం ‘బంగార్రాజు’తో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కళ్యాణ కృష్ణ దర్శకత్వం వహించిన ఇది 2016 సూపర్ హిట్ మూవీ సోగ్గాడే చిన్ని నాయనాకు సీక్వెల్. నిన్న ఈ చిత్రానికి సంబంధించి ‘మ్యూజికల్ నైట్’ అంటూ ఓ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ “నా సినిమాలన్నీ మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్స్… చైతన్య, నాగార్జునలతో కలిసి చేసిన మూడు సినిమాలు కూడా మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్స్… మ్యూజిక్ పరంగా నాగార్జున ఇచ్చే సలహాలు ప్రైజ్ లెస్… ఒక సాంగ్ విషయంలో తన సాంగే బాగుండాలని పోటీ పడ్డారు. 100 మంది 100 రోజులు నాన్ స్టాప్ గా వర్క్ చేయడం వల్లే ఈరోజు ఇక్కడకు ఉన్నాము” అని అన్నారు. కళ్యాణ్ కృష్ణ ఇంకా మాట్లాడుతూ నాగార్జున గురించి రొమాంటిక్ హీరో, మర్డర్స్, ఫైట్స్ అంటూ ఆసక్తికర చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఈ వీడియోలో చూడండి.

మరోవైపు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కళ్యాణ కృష్ణ మాట్లాడుతూ ‘బంగార్రాజు’కు సీక్వెల్ చేసే ఆలోచన లేదన్నారు. “ప్రస్తుతం బంగార్రాజుకు సీక్వెల్‌ చేయడం చాలా కష్టమైన పని. ముందుగా కథ రాసి సంతృప్తి చెందాలి. ఆ తరువాత అఖిల్‌ని ఇంప్రెస్ చేయాలి. ఒక ఉత్తేజకరమైన ఆలోచన నా మనస్సులోకి వస్తే నేను దానిపై పని చేయగలను. కానీ ప్రస్తుతానికి అలాంటిదేమీ జరగలేదు” అని ఆయన అన్నారు.

Related Articles

Latest Articles