మళ్ళీ ట్రాక్ లోకి చిరంజీవి చిన్నల్లుడు!

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’ తర్వాత పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. నిజానికి కరోనా ఫస్ట్ వేవ్ తగ్గగానే ఫస్ట్ తన సినిమా ‘సూపర్ మచ్చి’నే కళ్యాణ్‌ దేవ్ సెట్స్ మీదకు తీసుకెళ్ళాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ విడుదలకు సిద్ధంగా ఉంది. మధ్యలో దీనిని ఓటీటీలో విడుదల చేస్తారనే వార్తలూ వచ్చాయి. అలానే ‘కిన్నెరసాని’ సినిమా కూడా కళ్యాణ్‌ దేవ్ చేస్తున్నాడు. దీనిని ‘అశ్వద్ధామ’ ఫేమ్ రమణ తేజ్ తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచారు. ఇదే సమయంలో కళ్యాణ్‌ దేవ్, అవికా గోర్ జంటగా గీతా ఆర్ట్స్ 2, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి రచయిత శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్నాడు. ఇన్ని సినిమాలు సెట్స్ పై ఉండగానే మరో చిత్రానికి కళ్యాణ్ దేవ్ పచ్చజెండా ఊపేశాడు.

‘కథ కంచికి మనం ఇంటికి’ చిత్రాన్ని నిర్మించిన మోనిష్ పత్తిపాటి… కళ్యాణ్ దేవ్ హీరోగా ఓ సినిమాను మొదలు పెట్టారు. దత్తి సురేశ్ బాబు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ మూవీకి ఎం. కుమార స్వామి నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. కూకట్ పల్లిలోని తులసి వనంలో ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ రెగ్యులర్ షూటింగ్ ను అక్టోబర్ నుండి మొదలుపెడతామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. మొత్తానికి చిరంజీవి చిన్నల్లుడు నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తూ.. రైట్ టైమ్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఉంది.

Related Articles

Latest Articles

-Advertisement-