సింపతీ కోసమే చంద్రబాబు ఇలా చేస్తున్నారు : కాకినాడ ఎమ్మెల్యే

ఏపీ అసెంబ్లీ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, నందమూరి అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబుపై పలు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లో జరిగింది నాటకంతో కూడినటువంటి వ్యవహారమని, అసెంబ్లీలో జరిగింది వేరు బయట జరుగుతున్న ప్రచారం వేరని ఆయన అన్నారు. భువనేశ్వరిని ఎవరు ఏమి అనలేదని, చంద్రబాబు ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నారన్నారు.

చంద్రబాబు తన సతీమణిని అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారని, హెరాయిన్ కేసు లో నా పాత్ర ఉందని తప్పుడు ప్రచారం చేసారని గుర్తు చేశారు. అప్పుడు నేను బాధపడనా..? నన్ను ఒక మాట అంటే నేను నాలుగు మాటలు అంటాను. టీడీపీ నాయకులు ఆలోచించి మాట్లాడాలి. సింపతి కోసమే చంద్రబాబు ఇలా చేస్తున్నారు. అసెంబ్లీ లో ఎవరు మాట్లాడారో రికార్డు లు పరిశీలించాలి. గతం లో పట్టాభి సీఎం జగన్ ను బోసిడికే అని తిడితే నారా లోకేష్ సమర్ధించారు. అప్పుడు చంద్రబాబు ఎందుకు స్పందించలేదు. అప్పుడు కుటుంబం విలువలు గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు.

రామారావు కుటుంబాన్ని ఏకం చేయాలి అని చంద్రబాబు చూస్తున్నారు. ఎన్టీఆర్‌ కుమార్తె గా భువనేశ్వరి కి మేము గౌరవిస్తాం. నందమూరి కుటుంబం సభ్యులకు అవగాహన లేదు. భువనేశ్వరి కోసం రన్నింగ్ కామెంట్రీ లోకూడా ఎవరు కనీసం మాట్లాడలేదు. త్వరలో నందమూరి కుటుంబ సభ్యులు జరిగిన విషయం తెలుసుకుంటారు. అనవసరంగా చంద్రబాబు మాయలో, ఉచ్చులో పడకండి అని ఆయన అన్నారు.

Related Articles

Latest Articles