మల్టీ స్టారర్ ‘హాట్ హారర్’ మూవీలో… కాజల్, రెజీనా!

ఒకరు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు అందమైన భామలు! కానీ, సదరు సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ కాదు! హారర్ మూవీ! అంటే… నలుగురు హాట్ బ్యూటీస్ నటించిన హారర్ థ్రిల్లర్ అన్నమాట!
తమిళ దర్శకుడు డీకే సారథ్యంలో రూపొందింది ‘కరుణ్గాపియమ్’ సినిమా. కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్రా, రైజా విల్సన్, జననీ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. హారర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. దర్వకుడు డీకే తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అఫీషియల్ గా రిలీజ్ చేశాడు. పోస్టర్ లో నలుగురు హీరోయిన్స్ ఫేసెస్ సైడ్ యాంగిల్ లో చూపించారు…
కాజల్, రెజీనా లాంటి హీరోయిన్స్ ఉండటంతో డైరెక్టర్ డీకే లెటెస్ట్ హారర్ థ్రిల్లర్ తెలుగులోనూ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి, మల్టీ స్టారర్ బ్యూటీఫుల్ హారర్ థ్రిల్లర్ కోలీవుడ్ లో, టాలీవుడ్ లో ఎలాంటి జనాదరణ పొందుతుందో!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-