మా కుటుంబంలోకి లిటిల్ వన్, మొదటి బిడ్డ… కాజల్, గౌతమ్ స్పెషల్ పోస్ట్

సౌత్ బ్యూటీ కాజల్ అగర్వాల్ గర్భధారణ గురించి కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ కాజల్ ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. 2020 లో కాజల్ తన చిరకాల ప్రియుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది. తాజాగా ‘మా కుటుంబంలోకి లిటిల్ వన్’ అంటూ కాజల్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేసింది. అయితే ఆ లిటిల్ వన్ మీరు అనుకుంటున్న వన్ కాదు. అసలు విషయం ఏమిటంటే… కాజల్, గౌతమ్ ఇంటికి వచ్చిన ఆ లిటిల్ వన్ ఒక పెంపుడు కుక్క. దానికి వాళ్ళు మియా అని పేరు పెట్టారు. మియా ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కాజల్ తన కుటుంబంలో ఒక కొత్త సభ్యుడు వచ్చాడు’ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. కాజల్ గురించి ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే ఆమెకు డాగ్ ఫోబియా ఉంది.

Read Also : ‘మా’ సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా

ఆ కుక్క పిల్ల ఫోటోను షేర్ చేస్తూ కాజల్ “నా కుటుంబంలోని కొత్త సభ్యుడిని మీకు పరిచయం చేస్తాను. లిటిల్ మియా. నాకు చిన్నప్పటి నుండి కుక్కల భయం ఉందని నా సన్నిహితులకు తెలుసు. గౌతమ్ ఏమో పెంపుడు జంతువుల ప్రేమికుడు. పెంపుడు జంతువులతో పెరిగారు. జీవితం మనల్ని కలుపుకొని ఉండటానికి ప్రేమను పంచాలని బోధిస్తుంది. మియా చాలా సరదాగా, ముచ్చటగా, ఉత్సాహంతో మా జీవితాల్లోకి వచ్చింది. ఈ ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి” అంటూ తనకు డాగ్ ఫోబియా అన్న విషయాన్నీ వెల్లడించింది. ఇక ఆమె భర్త గౌతమ్ “మొదటి బిడ్డ, చివరకు కాజల్ అగర్వాల్‌ని ఒప్పించింది. కుక్కపిల్ల మియాకు స్వాగతం” అంటూ మియా ఫోటోలను పోస్ట్ చేశారు.

మా కుటుంబంలోకి లిటిల్ వన్, మొదటి బిడ్డ… కాజల్, గౌతమ్ స్పెషల్ పోస్ట్
మా కుటుంబంలోకి లిటిల్ వన్, మొదటి బిడ్డ… కాజల్, గౌతమ్ స్పెషల్ పోస్ట్
-Advertisement-మా కుటుంబంలోకి లిటిల్ వన్, మొదటి బిడ్డ… కాజల్, గౌతమ్ స్పెషల్ పోస్ట్

Related Articles

Latest Articles