నాగ్-ప్రవీణ్ సత్తారు మూవీ: నెవర్ బిఫోర్ లుక్ లో కాజల్!

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తరువాత కూడా వరుస సినిమాలతో జోరు మీద ఉంది. మరోవైపు వెబ్ సిరీస్ ల లోను రాణిస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమా.. లోకనాయకుడు కమల్ హాసన్ తో ‘ఇండియన్-2’ సినిమాలోను నటిస్తోంది. ఇదిలావుంటే, అక్కినేని నాగార్జున-ప్రవీణ్ సత్తారు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కాజల్ ఇంతవరకు చూడని కొత్త లుక్ లో కనిపించనుందని ఇదివరకే దర్శకుడు తెలియజేశాడు. కాగా కాజల్ ఈ చిత్రంలో వేశ్య పాత్రలో కనిపించనుందని టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. కాజల్ పాత్రకు సంబంధించి ఈ యాక్షన్ మూవీలో ‘రా’ ఏజెంట్ గా కనిపించనుందని టాక్ నడుస్తున్నప్పటికీ.. బోల్డ్ పాత్రలోనూ కనిపించనుందని తెలుస్తోంది. ఇది వరకు ఎన్నో పాత్రలు చేసిన కాజల్.. ఈ చిత్రంలో మాత్రం ఆమె పాత్ర నెవర్ బిఫోర్ అంటున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-