‘తగ్గేదే లే’ అంటున్న కాజల్.. కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య, లోకనాయకుడు కమల్ హాసన్ తో భారతీయుడు 2, అక్కినేని నాగార్జున-ప్రవీణ్ సత్తారు చిత్రంలోనూ కాజల్ కథానాయికగా నటిస్తోంది. అటు వెబ్ సిరీస్ లోను కాజల్ ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తూ పోతుంది. తాజాగా కాజల్ ‘ఉమ’ టైటిల్​తో తెరకెక్కబోయే బాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉన్నానని తెలిపింది. ఈ సినిమాతో తతగట సింఘా దర్శకుడిగా పరిచయమవుతుండగా.. సుజయ్ ఘోష్ నిర్మిస్తున్నారు. కాగా పెళ్లి నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-