మొదటిసారి బేబీ బంప్ ఫోటో షేర్ చేసిన కాజల్..

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. తన చిన్ననాటి స్నేహతుడు గౌతమ్ కిచ్లు ని వివాహమాడిన సంగతి తెలిసిందే. ఇక ఈ కొత్త సంవంత్సరం కాజల్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తానూ తల్లిని కాబోతున్నట్లు ప్రకటించింది. దీంతో కాజల్‌ దంపతులకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక ఇప్పటివరకు తన బేబీ బంప్ ను దాచిపెట్టిన ముద్దుగుమ్మ తాజాగా తన బేబీ బంప్ తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. భర్త గౌన్తం తో కలిసి బ్లాక్ డ్రెస్ లో బేబీ బంప్ కనిపించేలా దిగిన ఈ ఫోటో షేర్ చేస్తూ 2022 అంటూ లవ్‌ ఎమోజీని జతచేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే కాజల్ నటించిన ఆచార్య విడుదలకు సిద్ధమవుతుండగా.. ఆమె నటించిన మరో రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.

Related Articles

Latest Articles